మోడీ మతతత్వవాది కాడు: అన్నా హజారే (ఫొటోలు)

ఇండోర్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మత తత్వవాది కాడని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. ప్రత్యర్థులు మోడీని మతతత్వవాదిగా విమర్శిస్తారని, కానీ అందులో నిజం లేదని ఆయన అన్నారు. తాను మరో రాజకీయ పార్టీతో ఉన్నందున తాను బిజెపిలో చేరలేనని ఆయన అన్నారు.

యుపిఎ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కుంభకోణాలమయంగా యుపిఎ ప్రభుత్వం మారిందని ఆయన అన్నారు. కుంభకోణాలకు నైతిక బాధ్యత వహించి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని ఆయన బుధవారంనాడు డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణం చోటు చేసుకున్నప్పుడు మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖ ఇంచార్జీగా ఉన్నారని ఆయన అన్నారు.

పార్లమెంటు అవినీతిపరులతో, నేరగాళ్లతో నిండిపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమైన అర్థంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే జనతంత్ర యాత్రను ఉద్దేశించినట్లు అన్నారు. జనలోక్‌పాల్ బిల్లును తేవాలని ఆయన డిమాండ్ చేశారు.

భోపాల్‌లో...

మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినీలో జనతంత్ర యాత్ర సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్‌తో కలిసి మహకాళీ ఆలయంలో అభిషేకం చేస్తున్న అన్నా హజారే

ముంబైలో..

ముంబైలో జరిగిన రాష్ట్ర స్తాయి అటవీ శాఖ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో కలిసి అన్నా హజారే.

అజ్మీర్‌లో...

అజ్మీర్‌లో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో వికె సింగ్‌తో కలిసి అన్నా హజారే

బికనూర్‌లో...

బికనూర్‌లోని జున్ఘడ్ ఫోర్ట్ వద్ద జరిగిన బహిరంగ సభలో చిన్నారులతో కలిసి అన్నా హజారే

రోటక్‌లో...

రోటక్ జనతంత్ర యాత్రలో వికె సింగ్, అభి జిలానీలతో కలిసి అన్నా హజారే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+