కళ్యాణ్ రామ్ ఓం సినిమా భేష్: చంద్రబాబు కితాబు
హైదరాబాద్: కళ్యాణ్ రామ్ ఓం చిత్రాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. కళ్యాణ్ రామ్ 3డీ చిత్రం "ఓం" అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అద్భుత సాంకేత పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చిత్రం ప్రాంతీయ భాషల చిత్ర సీమలకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

కళ్యాణ్ రామ్ నటించి, నిర్మించిన త్రీడీ సినిమా 'ఓం'ను చంద్రబాబు గురువారం వీక్షించారు. అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ సినిమా ప్రాంతీయభాషల చిత్రసీమలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సినిమాను అంతర్జాతీయ నిపుణులు ఎంతో శ్రమించి సాంకేతిక అద్భుతంగా మలిచారన్నారు.
కళ్యాణ్ రామ్ సినీ జీవితానికి, తెలుగు సినిమా చరిత్రకు ఈ సినిమా మేలి మలుపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించేందుకు ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. కళ్యాణ్ రామ్ సరసన కృతి కర్బందా, నికీషా పటేల్ నటించారు. కథ, స్క్రీన్ ప్లేను అందించడంతో పాటు సునీల్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications