వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతకాలు: బొత్సపై కొండా సురేఖ ఫైర్, కిరణ్‌పై రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

konda surekha and roja
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి సంతకాల సేకరణ ఆలోచన చేసింది ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణే అని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ శుక్రవారం అన్నారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌కు బొత్స ఏం సాయం చేశారో ప్రజల ముందు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బొత్స వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ పార్టీకి చెందిన నేతలు సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్‌లు విజయవాడలో డిమాండ్ చేశారు. మద్యం, పేకాట లేకుండా బొత్సకు రోజు గడవదన్నారు. ఎంపిగా ఉండే పేకాట ఆడిన చరిత్ర ఆయనదన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనిషి బొత్స అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ చలువ లేకుంటే బొత్స సాధారణ కార్యకర్తగా మిగిలే వారన్నారు.

కన్నీరు కత్తి కంటే పదును: రోజా

ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా శుక్రవారం మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. విజయమ్మ చేపట్టిన ఫీజు పోరు దీక్షా ప్రాంగణంలో రోజా మాట్లాడారు.

విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పేదవాడి కన్నీరు కత్తికంటే పదునైందన్నారు. అది ప్రభుత్వానికి శాపంగా మారుతుందని మండిపడ్డారు. అవసరం అయిన వాటికి నిధులు కేటాయించని సర్కారు అడ్డగోలుగా ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు.

English summary
YSR Congress Party leader and Former Minister Konda Surekha demanded PCC cheif Botsa Satyanarayana to reveal why Anil Kumar was met him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X