ఏడాదికోసారి జాతరలా: విజయమ్మ దీక్షపై పితాని సెటైర్

ఈ దీక్ష పైన పితాని మండిపడ్డారు. ప్రతి ఏటా జాతర మాదిరిగా జగన్ పార్టీ ఫీజు పోరు దీక్షలు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీవి శవ రాజకీయాలని ఆరోపించారు. గతేడాది ఫీజు రీయింబర్సుమెంట్స్ బకాయిలు ఏమీ లేవని చెప్పారు. విజయమ్మ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిలో ఉనికి చాటుకునేందుకే విజయమ్మ దీక్ష చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రులు మారినా ఫీజు రీయింబర్సుమెంట్స్ ఎక్కడా ఆగలేదని ఆయన చెప్పారు. విద్యార్థులకు నష్టం కలగకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో దీక్షలు చేపట్టడం సరికాదన్నారు. ఆయన ఈ రోజు ఉదయం సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఆమె దీక్ష ముగించనున్నారు.












Click it and Unblock the Notifications