వరదలు: మోడీ పర్యవేక్షణ, కేదార్‌నాథ్ ఇలా...(పిక్చర్స్)
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వరదలు ఇటీవల భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. యమను, భాగీరథి, మందాకిని, అలకనంద తదితర నదుల ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. భవంతులు కూలిపోయాయి. వేలాది మంది చనిపోయారు. దాదాపు లక్ష మంది వరదల్లో చిక్కుకుపోవడంతో వారిని సైన్యం కాపాడింది.
ఉత్తరాఖండ్ వరదలు సునామిని తలపించాయి. కేదార్, రాంవాడ, గౌరీకుండ్, సోన్ ప్రయాగ, ఉకిమఠ్ తదితర ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది మంది యాత్రికులే కాకుండా, చాలా జంతువులు చనిపోయాయి. వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ రాష్ట్ర భక్తులను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేశాయి. అందులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు నిలిచారు.
వరద బాధితులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం, భారత వైమానిక దళం, నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత సైన్యం, ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీసు, స్థానిక పోలీసులు.. ఇలా అందరు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. వరద బాధితులకు మోడీ ముఖ్యమంత్రి ఫండ్స్ నుండి రెండు కోట్ల రూపాయలు, ఆ తర్వాత మరో మూడుకోట్ల రూపాయలను విడుదల చేశారు.

మోడీ పర్యవేక్షణ
ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం వద్ద గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ.

బాధితులకు మందులు
ఉత్తరాఖండ్ వరదల బాధితుల కోసం తరలిస్తున్న వైద్య సామాగ్రి. వాహనాలలోకి సామాగ్రిని ఎక్కిస్తున్న సిబ్బంది.

వైద్య సహాయ కేంద్రం
గుజరాత్ నుండి వచ్చిన ఓ వైద్య బృందం ఉత్తరాఖండ్ వరద బాధితుడికి వైద్య సహాయం అందిస్తున్న దృశ్యం.

మెడికల్ రిలీఫ్
ఉత్తరాఖండ్ వరద బాధితులకు వైద్య సహాయం కోసం గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ మొబైల్.

కేదార్‌నాథ్ ఇలా..
గత నెలలో వచ్చిన భారీ వరదల కారణంగా పవిత్ర కేదార్‌నాథ్ గ్రామం ఇలా తుడిచి పెట్టుకుపోయింది. చాలా ప్రాంతాలు వరదల్లో కొట్టుకుపోయాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications