బాబు మౌనం: తెలంగాణ ఏర్పడితే ఏం చేస్తారు?

Chandrababu
హైదరాబాద్: తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మౌనముద్ర దాల్చారు. తెలంగాణపై చెప్పాల్సింది చెప్పామని, ఇంకా చెప్పేదేమీ లేదని ఆయన ఆ మధ్య ఓసారి అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులు రెండుగా చీలిపోయి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ, పరస్పరం విమర్శలు చేసుకుంటుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు కూడా మౌనం దాల్చారు.

రాష్ట్ర విభజన అంశంపై నోరు విప్పవద్దని చంద్రబాబు పార్టీ నాయకులకు హుకుం జారీ చేశారని అంటున్నారు. ఇటు తెలంగాణ నేతలు గానీ అటు సీమాంధ్ర నాయకులు గానీ విభజన అంశంపై ఏమీ మాట్లాడడం లేదు. తెలంగాణ బంతి కాంగ్రెసు పార్టీలో ఉంది కాబట్టి తామేమీ మాట్లాడకపోవడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతంలో నష్టం జరగకుండా చూసుకోవడానికే ఆయన మాట్లాడడం లేదని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా వ్యతిరేకిస్తున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం శాసనభ్యుడు పయ్యావుల కేశవ్ కూడా ఏమీ మాట్లాడడం లేదు. అయితే, ఆయన సమైక్యవాదాన్ని గట్టిగా సమర్థిస్తున్న సీమాంధ్ర మంత్రి గంటా శ్రీనివాస రావుతో సమావేశమైనట్లు ఇటీవల ఊహాగానాలు చెలరేగాయి. తెలంగాణపై ఢిల్లీలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడానికే ఆయన గంటాను కలిసినట్లు చెబుతున్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన రాష్ట్రం రెండుగా విడిపోతే ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కావడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. ఆయన పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుగుదేశం వర్గాలంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్తారని, ప్రధాని పదవి చేపడుతారని గతంలో ఒకటి రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేసిన తర్వాత సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో రాజీనామాల వ్యవహారాన్ని నడిపింది చంద్రబాబే అనే విమర్శలు మొదటి నుంచీ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య, ఇప్పటి కేంద్ర మంత్రి చిరంజీవితో కలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారనే నిందను ఆయన మోస్తున్నారు. ఈసారి అటువంటి విమర్శలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తాము ఆపలేమనే భావనకు కూడా ఆయన గురైనట్లు చెబుతున్నారు. అయితే, విభజన జరిగితే, కేంద్రం, కాంగ్రెసు వ్యవహరించిన తీరును తప్పు పట్టడానికే ప్రస్తుతం ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం వెలువడితే తప్ప చంద్రబాబు ఏం చేస్తారనే విషయం తెలియదు. అప్పటి దాకా వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+