జగన్ కేసు: ఐఎఎస్‌ల ప్రాసిక్యూషన్‌పై హైకోర్టు నోటీసులు

ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కోరుతూ కుటుంబ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆ నోటీసులు జారీ చేసింది. వైయస్ జగన్ ఆస్తులు, ఒఎంసి, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసుల్లో ఆరుగురు ఐఎఎస్ అధికారులు నిందితులుగా ఉన్నారు. వారిలో శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్‌కు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. మిగతా ఐదుగురి విషయాన్ని పెండింగులో పెట్టింది.
ఐదుగురు ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులోనే కాకుండా ఒఎంసి కేసులో కూడా శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉంది. ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంలో జాప్యం జరగడం వల్ల విచారణలో కూడా జాప్యం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసి ఏడాది దాటుతోంది. ఒఎంసి కేసు విచారణ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కొన్ని చార్జిషీట్లను దాఖలు చేసింది. వాటిపై కూడా విచారణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.


Click it and Unblock the Notifications