సీమాంధ్రుల కోసం ప్రాణాలిస్తా: సర్వే, చూపిస్తా: కావూరి

ఎంతోమంది తెలుగువాళ్లు ఢిల్లీలో ఉంటున్నారని, వారిని ఎవరైనా పొమ్మంటారా అని ప్రశ్నించారు. తెలంగాణ జాగో.. ఆంధ్రావాలా భాగో వంటి రెచ్చగొట్టే నినాదాల పట్ల ప్రజలు సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగువారి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రులు హైదరాబాద్ విడిచి వెళ్లవల్సి వస్తుందని కొంతమంది స్వార్థపరులు ప్రచారం చేస్తున్నారని, అదే జరిగితే వారిని కాపాడేందుకు ప్రాణాలు అర్పిస్తానన్నారు.
చిన్న రాష్ట్రాలనేవి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసేవనని హిందీ మాట్లాడే వారికి అనేక రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు వారి కోసం రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటన్నారు. తమిళనాడు నుండి విడిపోయి ఎపి రాష్ట్రంఏర్పడినప్పుడు మద్రాసు నుంచి తెలుగువారు రాలేదన్నారు. అలాగే హైదరాబాదులో ఉన్న దేశం నలుమూలల ప్రజలకు ఎలాంటి భయం లేదన్నారు. కావూరి సాంబశివ రావుకు ఎప్పుడో మంత్రి పదవి వచ్చి ఉండాలన్నారు.
అనంతరం కావూరి మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తనను గుర్తించాలనే అభిప్రాయం తనకు ఉందన్నారు. ఉన్న ఆరు నెలల సమయంలో ఆరేళ్ల సేవ చేస్తానన్నారు. ప్రజలకు వీలైనంత ఎక్కువ సేవ చేయడానికే కృషి చేస్తానన్నారు. కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న కావూరి, జెడి శీలంలను ఆంధ్రా అసోసియేషన్ సన్మానించింది. ఈ సమయంలో వారు మాట్లాడారు.












Click it and Unblock the Notifications