సమ్మెకు సై, దేశంలో అన్నీ వదిలి 'టి' పైనా: ఎపిఎన్జీవో

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టవద్దన్నారు. సమైక్యాంధ్ర కోసం దేనికైనా సిద్ధమని, సమ్మెకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. సిడబ్ల్యూసి సమావేశాని కంటే ముందే సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేపడతామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులతో ఢిల్లీలో భారీ ధర్నా చేస్తామన్నారు.
బందుల వల్ల జనం నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే ఇరు ప్రాంతాలకు నష్టమన్నారు. విడగొట్టి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. నీళ్లు, కరెంట్ విషయంలో సీమాంధ్రులకు భయం ఉందని వారు అన్నారు. సిడబ్ల్యూసిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు సమైక్యవాదం వినిపించాలని లేదంటే వారి ఇళ్ల ముందు ఈ నెల 29వ తేదిన ధర్నాలు చేస్తామన్నారు.
సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపడతామన్నారు. సమైక్యాంధ్ర కోసం హైదరాబాదులో త్వరలో సన్నాహక సమావేశం జరుగుతుందని, విశాఖ, తిరుపతి, విజయవాడ, కడప, అనంతపురంలలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. విభజనకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడే నేతలనే గౌరవిస్తామన్నారు.












Click it and Unblock the Notifications