యువతిపై ఆటో డ్రైవర్ల అత్యాచారం: రిమాండ్ ఖైదీ మృతి

రైల్లో యువకుడి ఆత్మహత్యాయత్నం
కాకతీయ ప్యాసింజర్ రైలులోని బాత్రూమ్‌లో రామాచారి(23) అనే యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని గుర్తించిన తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయగా వెంటనే యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తనకు బతకాలని లేదంటూ రామాచారి రాసిన సూసైడ్ నోట్ ఘటనా స్థలంలో లభ్యమైంది. రైలు వరంగల్ నుంచి సికింద్రాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామాచారిని వరంగల్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.
రిమాండ్ ఖైదీ మృతి
వరంగల్ జిల్లాలోని సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ రాములు మృతి చెందాడు. అయితే జైలు అధికారులే రాములును చంపారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో వరంగల్ - హన్మకొండ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే రాములు గుండె పోటుతో మృతి చెందాడని జైలు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications