సుప్రీంలో అనిల్, టీనా పిటిషన్: కేంద్రానికి మొట్టికాయ

న్యూఢిల్లీ/హైదరాబాద్: 2జి కేసులో సుప్రీం కోర్టులో పునఃసమీక్ష పిటిషన్‌ను అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీలు సోమవారం దాఖలు చేశారు. 2జి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) తమను సాక్ష్యులుగా చేర్చడంపై వీరు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

చనిపోతున్నా పట్టదా?: కేంద్రంపై సుప్రీం మండిపాటు

పొగాకు ఉత్పత్తుల యాడ్ నియంత్రణ పైన బాంబే హైకోర్టు ఇచ్చిన స్టేను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తప్పుపట్టింది. దీనిపై కేంద్రంపై సుప్రీం మండిపడింది. పొగాకు ఉత్పత్తుల యాడ్ నియంత్రణపై బాంబే హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. ప్రజలు కేన్సర్‌తో చనిపోతుంటే కేంద్రానికి పట్టదా అని ప్రశ్నించింది. బాంబే హైకోర్టును తప్పు పట్టింది.

SC to hear Anil and Tina Ambani plea against 2G summons

కేంద్రానికి హైకోర్టు నోటీసులు

ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ సోమవారం ఉదయం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణను స్వీకరించిన హైకోర్టు మూడు వారల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

మోపిదేవి బెయిల్ పిటిషన్ వాయిదా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల సిబిఐ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు 31వ తేదికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+