చైనాను కుదిపేసిన భూకంపాలు: 47 మంది మృతి
బీజింగ్: చైనాను రెండు భూకంపాలు కుదిపేశాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపంలో ఇప్పటి వరకు 47 మంది మృత్యువాత పడినట్టు సమాచారం. మరో 300 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.
సోమవారం ఉదయం 5 గంటల ప్రాతంలో చైనా వాయువ్య ప్రాంతంలోని జాంజియాన్, మిన్సియాన్ రాష్ట్రాల్లో ఈ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై భూకంపాలు 5.9, 5.6గా నమోదయ్యాయి. మొదటి భూకంప కేంద్రం బైడావో నగరానికి 151 కిలోమీటర్ల దూరంలో భూమికి కేవలం 9.8 కిలోమీటర్ల అడుగు భాగంలో గుర్తించినట్టు తెలిపారు.

ఈ భూకంపాల ధాటికి జాంజియాన్ రాష్ట్రంలో 1,203 గదులు కూలిపోయాయి. కేబుళ్లు తెగిపోవడంతో టెలికమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి పోలీసులు, సైనికులతో పాటు 300 మంది స్థానిక మిలీషియా సిబ్బందిని పంపారు. చైనా రెడ్క్రాస్ సొసైటీ కూడా రంగంలోకి దిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో శిథిలాల కుప్పలు పేరుకుపోయినట్లు టీవి చానెళ్ల దృశ్యాలు తెలియజేస్తున్నాయి. పెద్ద భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమదైనట్లు బీజింగ్ చైనా భూకంపాల వ్యవస్థా కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications