సర్వే: లోకసభ ఎన్నికల్లో దీదీ హవా, తగ్గినా నితీష్ 'ప్రభ'

Mamata Banerjee - Nitish Kumar
న్యూఢిల్లీ: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్‌లో దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు, బీహార్‌లో జెడి(యు) ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి. సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)కు 23-27 సీట్లు, జెడి(యు)కు 15 నుండి 19 సీట్లు వస్తాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పునాదులు గట్టిగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

2014లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో యుపి తరవాత కీలక భూమికను పోషించే అవకాశమున్న పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్‌లో 40 లోకసభ స్థానాలు ఉన్నాయి. బెంగాల్‌లో దీదీకి ఓటర్లు ఏకపక్షంగా పట్టం కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీహార్‌లో మాత్రం జెడి(యు) సీట్లు తగ్గే అవకాశముంది. అయితే బిజెపి-జెడి(యు) మధ్య బంధం తెగిపోవడమే అందుకు కారణం.

ప్రస్తుతం జెడి(యు)కు బీహార్లో 20 ఎంపీ స్థానాలున్నాయి. బిజెపి-జెడి(యు)ల మధ్య పొత్తు బెడిసికొట్టిన నేపథ్యంలో జెడి(యు) 15-19 సీట్లలో గెలిచే అవకాశముంది. బిజెపి సీట్ల సంఖ్య 8-12 స్థానాలకు పరిమితం కానుంది. అయితే ఓటింగ్ శాతం మాత్రం పెరుగనుంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసి కొట్టడం ఆర్జేడికి కలిసి వస్తుంది. ఆ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది. సీట్లు మాత్రం బిజెపితో సమానంగా వచ్చే అవకాశముంది. పాశ్వాన్ పార్టీ రెండు స్థానాల వరకు గెలువొచ్చు.

పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తృణమూల్ కాంగ్రెసు పార్టీ 23-27 సీట్లను గెలుచుకోనుంది. అయితే ఓటింగ్ మాత్రం ఒక్క శాతమే పెరుగనుంది. 2009లో లెఫ్ట్ కూటమి సీట్లు 15 కాగా, ఇప్పుడు అది ఏడు నుండి 11కు పడిపోనుంది. కాంగ్రెసుకు 5-9, బిజెపికి రెండు సీట్ల వరకు రావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+