జైల్లో ఒకరు, యాత్రతో మరొకరు: సిఆర్, చంద్రబాబు లేఖ

కొత్త పార్టీ చేసిన అరాచకాలను, అక్రమాలను ప్రజలు తెలుసుకున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. తర్వాత జరిగే రెండు విడత ఎన్నికల్లోను తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు.
దిక్సూచి: తులసి రెడ్డి
2014 ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలు దిక్సూచి అని తులసి రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందనుకున్న వారికి తమ పార్టీ బలం ఈ ఫలితాలు తెలిపాయన్నారు. చిత్తూరు జిల్లాలలో తక్కువ స్థానాల్లో గెలుపొందడం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఫల్యం కాదన్నారు.
ఊహల లోకంలో బాబు: పొంగులేటి
చంద్రబాబు ఊహల లోకంలో విహరిస్తున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పార్టీ గుర్తుల ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయన్నారు. సీమాంధ్ర నేతలు సమావేశాలు పెట్టుకోవడంలో తప్పులేదని, తెలంగాణకు మాత్రం అడ్డుపడవద్దన్నారు. వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులకు సహాయం పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
కిరణ్‌తో విభేదాల్లేవు: బొత్స
కిరణ్ కుమార్ రెడ్డితో తనకు విభేదాల్లేవని బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెసు పార్టీకి విలీనాల అవసరం లేదన్నారు.
ఈసికి బాబు లేఖ
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి గ్రామ పంచాయతీలో రీకౌంటింగ్ జరిపించాలని చంద్రబాబు నాయుడు ఈసికి లేఖ రాశారు.












Click it and Unblock the Notifications