అనుమానం: భార్యను వెంటాడి రోడ్డుపై నరికాడు

 Man hacks wife after chasing her down the road
బెంగళూర్: తనను వదిలేసిన భార్యను ఓ వ్యక్తి రోడ్డుపై వెంటాడి నరికాడు. ఈ ఘటనలో అతని భార్య 21 ఏళ్ల దీప తీవ్రంగా గాయపడింది. ఆమె చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని బ్యాపనహళ్లిలోని కాలపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద మంగళవారంనాడు జరిగింది.

గజేంద్ర నగర్‌లోని దీప తల్లిగారింట్లో భార్యాభర్తలకు మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత ఆ సంఘటన చోటు చేసుకుంది. ఆటోడ్రైవర్ అయిన బాబు దీపపై దాడి చేసిన తర్వాత పారిపోయాడు. హత్యాప్రయత్నం కింద బ్యాపనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి బాబు కోసం గాలిస్తున్నారు.

బాబు, దీప ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దాంతో వారికి పరిచయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించకపోయినా వారు వివాహం చేసుకున్నారు. బ్యాపనహళ్లిలోని అద్దె ఇంట్లో వారు తమ పిల్లలు పార్వతి (5), భరత్ (3)లతో కలిసి ఉంటున్నారు.

భార్యపై అనుమానం వచ్చి బాబు గొడవ పడుతూ వచ్చాడని, దాంతో ఇరువురి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, బాబు మద్యానికి అలవాటు పడ్డాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వేధింపులపై దీప ఫిర్యాదు కూడా చేసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+