ఎన్డీయే ప్రధాని అభ్యర్థి: బాలీవుడ్ స్టార్ శత్రఘ్ను మెలిక

అద్వానీని ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నట్లు చెప్పారు. ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. తద్వారా మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారనే చెప్పవచ్చు. సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హా వంటి సీనియర్ నేతలు ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు. సిన్హా మాజీ ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో పని చేశారు. సిన్హా అదే సమయంలో మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు.
మోడీ చాలా పాపులర్ నేత అని, అతను తనకు సన్నిహితుడని, పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తర్వాత మోడీ ప్రధాని అభ్యర్థి అయితే మంచిదని అయితే, అద్వానీ కూడా అంతకంటే అర్హుడని అభిప్రాయపడ్డారు. భారత రాజకీయాలకు వాజపేయి తండ్రి అయితే, అద్వానీ గాడ్ ఫాదర్ అన్నారు. సిన్హా వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు స్పందించారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో బిజెపిలోనే ఏకాభిప్రాయం లేదని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.
గుజరాత్‌ను చూసి నేర్చుకవాలి: అమర్త్య సేన్
నరేంద్ర మోడీ ప్రధాని కావడాన్ని తాను అంగీకరించనని చెప్పిన నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ తాజాగా గుజరాత్ వాణిజ్య రంగానికి కితాబిచ్చారు. ఆరోగ్యం, అక్షరాస్యత రంగాలు, అల్పసంఖ్యాక వర్గాల హక్కుల విషయంలో గుజరాత్ వెనుకబడి ఉన్నా.. మంచి వాణిజ్య సామర్థ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో ఆ రాష్ట్రం నుండి పాఠాలు నేర్చుకోవాలన్నారు.
షకీల్ ప్రకంపనలు
కాగా గుజరాత్ అల్లర్ల ఫలితంగానే ఇండియన్ ముజాహిద్దీన్ ఆవిర్భవించిందంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షకీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుని ఓట్లను దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బిజెపి మంగళవారం తీవ్ర ఆరోపణలు చేసింది. షకీల్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అంటూ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు షకీల్ అహ్మద్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. ఈ విషయంలో షకీల్‌కు పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, మైనార్టీ వ్యవహారాల మంత్రి రెహ్మాన్ ఖాన్ నుంచి మద్దతు లభించింది. అయితే, షకీల్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఏకాకిగా మారిన ఆయన నేరుగానే బిజెపిపై విరుచుకు పడ్డారు.
ఇండియన్ ముజాహిద్దీన్ ఆవిర్భావానికి సంబంధించి జాతీయ దర్యాప్తు ఏజెన్సీ చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదాన్ని ఆసరా చేసుకుని కూడా ఓట్లను సంపాదించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్ అలాగే ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ వెనకేసుకొస్తోందని బిజెపికి చెందిన మరో సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు.












Click it and Unblock the Notifications