కిరణ్‌కు భయం: రోజా, బాబు పనైపోయింది: పాలడుగు

ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా తమ పార్టీ మద్దతుదారులే ఎక్కువ స్థానాలను సాధిస్తారన్నారు. కాంగ్రెసు పార్టీ దాడులను తెలుగుదేశం పార్టీ ఖండించక పోవడం శోచనీయమన్నారు. రెండు పార్టీలు కలిసి సహకార ఎన్నికల తరహాలోనే కుమ్మక్కు అయ్యాయని విమర్శించారు.
బాబుపై పాలడుగు ఫైర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన కాంగ్రెసు పార్టీ శాసన మండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు మండిపడ్డారు. బాబుకు కాంగ్రెసును ఓడించే శక్తి లేదని, ఆయన తరం కాదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వల్లనే తాము నష్టపోయామని అన్నారు.
చంద్రబాబుకు నైతికత, సిద్ధాంతాలు లేవన్నారు. ప్రాంతీయవాదంతో వచ్చిన టిడిపి ఉప ప్రాంతీయవాదానికి జవాబు చెప్పలేకపోయిందన్నారు. కొన్ని సర్పంచు పదవులు గెలువగానే భవిష్యత్తు తనదేనని బాబు భ్రమపడుతున్నారన్నారు. బాబు పని అయిపోయిందని, ఆ పార్టీ గెలువలేదన్నారు.












Click it and Unblock the Notifications