లాక్కోవడం లేదు: టిపై పొన్నం, టిఎన్జీవో Vs ఎపిఎన్జీవో

Ponnam Prabhakar
హైదరాబాద్/న్యూఢిల్లీ: తాము ఎవరి దగ్గరి నుండి రాష్ట్రాన్ని లాక్కోవడం లేదని, విభజనకు సీమాంధ్ర నేతలు అడ్డుపడవద్దని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ శనివారం విజ్ఞప్తి చేశారు. పార్టీల మధ్య తెలంగాణపై విభజన వచ్చిందని, బలవంతంగా కలిసి ఉండాలని చెప్పడం సరికాదన్నారు. దయచేసి కలహాల కాపురం వద్దని, విభజనపై నిర్ణయానికి అడ్డుపడవద్దని ఆయన కోరారు.

ఢిల్లీలో లాబీయింగ్ చేసి బలవంతంగా నిర్ణయాన్ని ఆపుదల చేసే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. ప్రజాస్వామిక హక్కు ఆధారంగా పార్టీ విభజనకు నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ఇస్తామన్నప్పుడల్లా సీమాంధ్ర నేతలు విభజనకు అడ్డుపడితే వైషమ్యాలు మరింత పెరుగుతాయన్నారు. మూడేళ్లుగా సంప్రదింపుల ప్రక్రియ చేశారన్నారు. సంప్రదింపులు పూర్తయ్యాయని రాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ స్వయంగా చెప్పారన్నారు.

సమైక్యంగా ఉంచాలి: ఎపిఎన్జీవో

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎపిఎన్జీవోల సంఘం శనివారం హైదరాబాదులో డిమాండ్ చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము ఉద్యోగాలు వదులుకొని ఆందోళనలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నెల 29న సీమాంధ్ర ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా చేపడుతామని, 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆగస్టు 1న సీమాంధ్ర మంత్రుల ఇళ్ల ముట్టడి, 2న సీమాంధ్ర ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.

ఆగస్టు 6లోపు సీమాంధ్రకు అనుకూలంగా ప్రకటన రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. టిఎన్జీవోలు సద్భావన యాత్రలు చేపడితే.. తాము అవగాహన యాత్రలు చేపడుతామన్నారు. రెచ్చగొట్టినా తాము ఆందోళన చేస్తామన్నారు. సమైక్యాంధ్ర కోసం కొత్త వేదికను ప్రకటిస్తామన్నారు.

సహరించండి: కోదండ

రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలు సహకరించాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా కోరారు. అన్ని పార్టీలు విభజనకు అంగీకరించాయని, ఇలాంటి పరిస్థితుల్లో అడ్డుకోవద్దన్నారు. విభజన అనివార్యమన్నారు. తాము హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప మరొకటి అంగీకరించమని టిఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. తాము ఎవరినీ రెచ్చగొట్టమని ఎపిఎన్జీవోను ఉద్దేశించి దేవీ ప్రసాద్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+