భోజనాలు లేక కౌంటింగ్ ఆలస్యం: దేవినేని అరెస్ట్, ఉద్రిక్తం

Vijayawada
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సిబ్బందికి భోజనాలు లేక, ఏజెంటు ఫారాలు లేక తదితర కారణాలతో కౌంటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలోని బెళగుప్పలో, శ్రీకాకుళం హిరమండలంలో భోజనాలు రాకపోవడంతో ఆలస్యమైంది. ప్రకాశం జిల్లా దర్శి పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

కాగా అంతకుముందు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు ముగిసింది. రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట వార్డు మెంబర్స్, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు.

దేవినేని అరెస్ట్

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో రీపోలింగ్ నిర్వహించాలంటూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఒకే ఇంటి చిరునామాతో ఉన్న 250 ఓట్లను తొలగించి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడంతో భారీగా మోహరించిన పోలీసులు దేవినేని ఉమ సహా పలువురిని అరెస్ట్ చేశారు.

మధ్యాహ్నం ఒకటి గంటల వరకు వరుసలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం అధికారులు అనుమతిస్తున్నారు. కొన్నిచోట్ల గుర్తులు తారుమారు కావడం, అభ్యర్థులు లేకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. తమ ఓట్లు గల్లంతు కావడం, దొంగ ఓట్లు వేస్తుండటం తదితర కారణాల వల్ల పలుచోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాల పైన దాడి చేయడం, ఓటింగును అడ్డుకోవడం చేశారు.

ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+