జగన్ పార్టీ టీ నేత ధ్వజం: దుర్మార్గమన్న మేకపాటి

వైయస్ రాజశేఖర రెడ్డిపై, జగన్‌పై అభిమానంతో తాము పార్టీలోకి వచ్చామని, తెలంగాణ ఆత్మాభిమానంతో అసంతృప్తి ఉన్నామని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ ప్లీనరీలో చెప్పినదానికి కట్టుబడి ఉండకపోవడం వల్లనే పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పార్టీలో కొందరు ఆత్మవంచన చేసుకుంటుంటే, కొందరు ఆత్మ విమర్స చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
తెలంగాణపై అఖిల పక్ష సమావేశానికి ఇచ్చిన లేఖకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సీమాంధ్ర శానససభ్యులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెసు వైఖరి చెప్పాలని అడిగింది తమ పార్టీనే అని, కాంగ్రెసు వైఖరి చెప్పకముందే తమ పార్టీవారే రాజీనామాలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు వైఖరి వెల్లడైన తర్వాత తెలంగాణ నాయకులను కూడా కలుపుకుని కార్యాచరణ రూపొందించుకుంటే బాగుండేదని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేయబోతున్నారనేది ఉత్కంఠగా ప్రజలు ఎదురు చూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణపై ఏం చేస్తారనేది తెలియడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్సించారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారని, అవమానిస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
ప్రజలను కాంగ్రెసు పార్టీ గందరగోళ పరుస్తోందని ఆయన అన్నారు. తెలంగాణపై ఏం చేస్తారనేది అధికారికంగా ప్రకటించలేదని ఆయన అన్నారు. కొండా దంపతులు తమతోనే ఉంటారని ఆయన అన్నారు. పార్టీలో ఎవరికీ అన్యాయం జరగదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలతో కాంగ్రెసు ఆడుకుంటోందని ఆన అన్నారు. విభజన ప్రభావం అన్ని పార్టీలపై ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారనే విషయాన్ని పత్రికల్లోనే చూశానని చెప్పారు.
తమ పార్టీ నేత షర్మిల పాదయాత్ర 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుందని, ఈ సందర్భంగా జరిగే ముగింపు సభకు నాయకులంతా హాజరు కావాలని ఆయన అన్నారు. ఓ మహిళా నేత ఇంత సుదీర్ఘ యాత్ర చేయడం అవూర్వమని ఆయన అన్నారు. షర్మిల 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications