వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ తూట్లు, సిఎం తప్పుకుంటారేమో: టిజి

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్: తెలంగాణ ఇస్తే ఫరవాలేదంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమైక్యవాదానికి తూట్లు పొడిచారని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ నిందించారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉంటామని తెలుగుదేశం, జగన్ పార్టీ చెప్పి వుంటే విభజనకు వ్యతిరేకంగా తాము పోరాడి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉంటామని ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా లేఖ ఇస్తే తాము వెళ్లి విభజనకు వ్యతిరేకంగా పట్టుబడుతామని, ఢిల్లీ వెళ్లి అధిష్టానం వద్ద కూర్చుంటామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

రాష్ట్ర విభజనకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తెలుగువాళ్లంతా ఒక్కటిగా ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నారని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అనుకుంటున్నారని, దానివల్ల విభజనకు నిర్ణయం జరిగితే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగరని అనుకుంటున్నానని ఆయన వివరించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కిరణ్ కుమార్ రెడ్డి కృషి చేస్తారని, విభజనలో తాను భాగస్వామిని కాలేనని చెప్పారని, తాను తెలంగాణ భూమిపుత్రుడిని అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, విభజన జరిగితే నిజంగానే బాధపడుతారని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విభజనను కోరిన పార్టీలకు ప్రజలు ఓటేశారని, అలా జరగకపోతే కాంగ్రెసు అధిష్టానానికి సంకేతాలు వేరుగా వెళ్లేవని ఆయన అన్నారు. విభజన జరిగితే అందుకు ప్రజానీకం, పార్టీలు బాధ్యత వహించాల్సిందేనని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో విభజనపై చర్చలు ముగిశాయని, ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

విభజన అనివార్యమైతే ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలిపి ఆరు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలవారు కూడా అంగీకరిస్తారని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ అభిమతమని, విభజన జరగకూడదని తాము భావిస్తున్నామని, విభజనను అడ్డుకోవడానికి చాలా కష్టపడ్డామని మంత్రి అన్నారు. విభజన జరిగితే తాము ఎవరి మోచేతి నీళ్ల మీద బతకాలని అడుగుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Minister from Rayalaseema region TG Venkatesh blamed the YSR Congress party honorary president YS Vijayamma for the proposal of bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X