లక్షకోట్లు దోచుకున్నోళ్లకు లెక్కకాదు: జగన్‌పై సురేఖ

Konda Surekha lashes out at YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ సోమవారం ఘాటైన పదజాలంతో బహిరంగ లేఖ రాశారు. మాట తప్పను.. మడమ తిప్పను.. ఇది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాట అని, మాట తప్పుతా.. మడమ తిప్పుతా... ఇది లక్ష కోట్లు దోచుకున్న వారి మాట అని కొండా సురేఖ తన లేఖలో ఘాటుగా పేర్కొన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ అని మండిపడ్డారు. ఆ పార్టీ పక్కా సమైక్యవాద పార్టీ అని నిప్పులు చెరిగారు. ప్రజాబలం లేని వారిని బ్రోకర్ల ద్వారా ఎమ్మెల్సీలు చేస్తున్నారని మండిపడ్డారు. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయం అధిష్టానానిది కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల టిక్కెట్లు అమ్ముకోవడానికి బేరసారాలు ఆడుతున్నారని ఆమె నిప్పులు చెరిగారు.

జగన్ జైలు నుండి సలహాలు ఇస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సహా వైయస్ జగన్ కూడా తనను అవమానించారని ఆరోపించారు. తెలంగాణపై విధానాన్ని ఎందుకు మార్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. విభజన ఖాయమని తెలిసి సీట్ల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీది సమైక్యవాదమా లేక ఇడుపులపాయ తీర్మానమా స్ఫష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ పార్టీని నాశనం చేశారని, తనను ఎంత అవమానించినా పార్టీ కోసం భరించానన్నారు. లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు తెలంగాణపై మాట తప్పడం పెద్ద విషయం కాదన్నారు. కాగా తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఈ రోజు సాయంత్రం కొండా సురేఖ నివాసంలో భేటీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+