పురంధేశ్వరి ఇంటి ముట్టడి, లగడపాటి ఇంటివద్ద ఉద్రిక్తం

సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లగడపాటి ఇంటి ముందు ఐకాస నేతలు టెంట్లు వేశారు. ఎపిఎన్జీవోలు ఇంటి పైకి ఎక్కారు. ఇంటిలోనికి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితిలు ఏర్పడ్డాయి. అధిష్టానంపై సమైక్యానికి అనుకూలంగా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు విభజనపై ఎందుకు మాట్లాడటం లేదని మండిపడుతున్నారు.
సిపిఎం, మజ్లిస్ పార్టీలు మినహా ఇతర పార్టీలు సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉండి, సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 610 జివో పైన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే అగ్ని గుండమవుతుందన్నారు. ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామా చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలను కాంగ్రెసు పార్టీ అధిష్టానం మరోసారి ఢిల్లీకి పిలిచినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రేపు యూపిఏ సమన్వయ కమిటీ, సిడబ్ల్యూసి భేటీ నేపథ్యంలో ఆ ముగ్గురు నేతలతో మరోసారి అధిష్టానం చర్చించనుంది.












Click it and Unblock the Notifications