ఏం చేద్దాం?: టి, సురేఖపై జగన్‌తో విజయమ్మ చర్చలు

ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు జగన్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖ, ఇతర తెలంగాణ నేతల హెచ్చరికలు, సమైక్యాంధ్ర నేతల రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. ప్రధానంగా కొండా సురేఖ అసంతృప్తి చర్చకు వచ్చిందని, కొండా దంపతుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
జగన్ ఆస్తుల కేసు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసు నిందితుల రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 12 వరకు పొడిగించింది. జగన్ తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జగన్, విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును పొడిగించారు.
జగన్ ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసుల్లో కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు రాజేంద్ర ప్రసాద్, నిత్యానంద రెడ్డిలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications