వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా ఎలా రాస్తారు: రాజీనామా వార్తలపై సిఎం ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. తాను అధిష్టానానానికి రాజీనామా సమర్పించేసినట్లు ఎలాంటి నిర్ధారణ, ఆధారాలు లేకుండా ఎలా రాసేస్తారని ఆయన అడిగారు.

విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేశారంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని సిఎంవో స్పష్టం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి ఆలోచనల్లో లేరని కూడా తెలిపింది. ఏదైనా ఉంటే నా వివరణ తీసుకోవాలని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కథనాలు ప్రచురించడం సమంజసం కాదని ఆయన ప్రకటనలో ముఖ్యమంత్రి అన్నారు.

కాగా, సీఎం తన పదవికి రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్ప లేదని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. రాజీనామా వార్తలన్నింటినీ బూటకంగా ఆయన కొట్టివేశారు. అదే సమయంలో వాటిని తాను ఖండించబోనని చెప్పారు.

గత శుక్రవారం కోర్ కమిటీ సమావేశం నేపథ్యంలో రాష్ట్ర విభజనలో తాను భాగస్వామిని కాలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. దాన్ని ఆధారం చేసుకుని వార్తాకథనాలు కూడా పెద్ద యెత్తునే వచ్చాయి.

English summary
CM Kiran kumar Reddy has condemned the resignation reports. according media reports - Kiran kumar Reddy opposing the bifurcation of Andhra Pradesh has submitted his resignation to Congress president sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X