వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలవంచుకు బతకలేక, విలువలేదు: జగన్ పార్టీపై కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

KK Mahender Reddy
హైదరాబాద్: తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తలవంచుకు బతకలేక, తలెత్తుకు బతికేందుకు ఆ పార్టీని వీడుతున్నామని ఆ పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, కెకె మహేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, రాజ్ ఠాకూర్, జిట్టా బాలకృష్ణా రెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.

తాము ఉద్యమమే ఊపిరిగా రాజకీయాల్లోకి వచ్చామని, కొందరు తెలంగాణను తమ రాజకీయావసరాల కోసం ఉపయోగించుకున్నారన్నారు. తాము పుట్టు తెలంగాణవాళ్లమని, పెట్టు తెలంగాణవాళ్లం కాదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు వ్యక్తిగతమైతే దానిపై ఆ పార్టీ ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్ తమ వేళ్లతో తమ కంటోనే పొడిచారన్నారు.

తెలంగాణ బిడ్డలకు ద్రోహం చేయలేక తాము పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తమను పార్టీ వెళ్లాల్సిందిగా పరోక్షంగా హెచ్చరించారన్నారు. పది జిల్లాల తెలంగాణను తాము కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ కోసం తమ వంతు పోరాటం చేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తెలంగాణవాదులకు విలువలేదన్నారు. తెలంగాణ వస్తుంటే ఓర్వలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కొండా సురేఖ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, రాజ్ ఠాకూర్ తదితరులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కూడా పార్టీ పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

English summary
YSR Congress Party Telangana leaders Konda Surekha, Jitta Balakrishna, KK Mahender Reddy resigned over Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X