జగన్ గురించి సూరీడు చెప్తే నమ్మలేదు: కొండా సురేఖ

తెలంగాణ బిడ్డల పోరాటానికి తుది నిర్ణయం వెలువడుతున్నందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పలేదన్నారు. వారే తమను బయటకు పంపించే ప్రయత్నాలు చేశారన్నారు. జగన్‌కు, పార్టీకి తాము మొదటి నుండి లాయల్‌గా ఉన్నా తమకు గౌరం లేకుండా పోయిందన్నారు. తమ లాంటి లాయల్ వ్యక్తులు పార్టీ నుండి వెళ్లిపోతున్నా ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు.
మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటే కొండా మురళీ ఊరుకున్నారని కానీ, ఆయనకు ఇవ్వకుండా ఎవరికో ఇచ్చారని మండిపడ్డారు. మురళీ ఎమ్మెల్సీ పదవికి ఎందుకు అర్హులు కారో చెప్పాలన్నారు. తాను, జగన్ వేదిక పైకి వస్తే తనకే ఆదరణ లభిస్తోందన్నారు. అది ఓర్వలేకే తనను బయటకు పంపించే ప్రయత్నాలు చేశారన్నారు. తెలంగాణ గురించి అడిగితే జగన్ దాటవేసే వారన్నారు.
జగన్ పైన తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమను పార్టీ నుండి వెళ్లేలా చేస్తున్నారన్నారు. తెలంగాణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకూలంగా లేదన్నారు. పదహారు మంది ఎమ్మెల్యేలు తమను సంప్రదించకుండా ఎలా రాజీనామా చేశారని ప్రశ్నించారు. జగన్‌తో తాము వెళ్లినప్పుడు, జగన్ వ్యక్తిత్వం తనకు తెలుసునని వద్దని చెబితే, తాము అతనిని తిట్టి పంపించామని, నిన్న ఆ విషయాన్ని తాము గుర్తు చేసుకున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications