పార్లమెంట్లో 'ఫుడ్'పై తేల్చుకుంటాం: సీమాంధ్ర అల్టిమేటం

సీమాంధ్ర నేతలు అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. తమ చివరి అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే సహించేది లేదన్నారు. ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోమని తాము చెప్పమని కానీ, శాస్త్రబద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎస్సార్సీ ద్వారా విభజించాలని కోరారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏమైనట్లని ప్రశ్నించారు. వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. ఏకపక్ష నిర్ణయం జరిగితే పార్లమెంటులో తేల్చుకుంటామని, ఆహార బిల్లుకు మద్దతిచ్చే అంశంపై పునరాలోచించాల్సి ఉంటుందని ఘాటుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. తమ మౌనం మరోరకంగా ఊహిస్తే తగిన ఫలితం ఉంటుందని చెప్పారు.
మరోవైపు సీమాంధ్రలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతల ఇళ్ల వద్ద బందోబస్తు ఉంచారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర నేతలను కాలు పెట్టనివ్వమని, వచ్చే ఎన్నికల్లో వారికి ఓటు వేయమని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నేతలు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications