వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా భవిష్యత్తుకాదు, సెంటిమెంట్ గౌరవించాలి: టిపై చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: ఎవరికి అన్యాయం జరిగినా బాధపడే పరిణామాలు ఉంటాయని, తమకు తమ భవిష్యత్తు ముఖ్యం కాదని తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పామని కేంద్రమంత్రి చిరంజీవి మంగళవారం అన్నారు. ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలుసుకున్నారు. చిరు, పళ్లం రాజు, జెడి శీలం, కనుమూరి బాపిరాజు తదితరులు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

పార్టీ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. నిర్ణయం ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉండాలని కోరామన్నారు. తమ ప్రాంత ప్రజల సెంటిమెంటును గౌరవించాలని కోరామన్నారు. సోనియా పైన నమ్మకముందని, అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుంటారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. పార్టీ అస్తిత్వాన్ని దెబ్బతీయవద్దని చెప్పామన్నారు.

తనకు ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని లేదన్నారు. ఇరు ప్రాంతాల భవిష్యత్తు ముఖ్యమన్నారు. తనకు అందరూ సమానమే అన్నారు. ఇరువర్గాల సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. తమకు తమ భవిష్యత్తు ముఖ్యం కాదని ప్రజలు, పార్టీ భవిష్యత్తు ముఖ్యమన్నారు.

అభిప్రాయాలు చెప్పాం

సీమాంధ్ర ప్రాంత ప్రజలు, నేతల అభిప్రాయాలను తాము చెప్పామని మంత్రి పళ్లం రాజు అన్నారు. రాజీనామాలు పరిష్కారం కాదని మరో మంత్రి జెడి శీలం అన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశలో అధిష్టానం ఆలోచిస్తోందన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుంటుందన్నారు. సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత చాలా ప్రక్రియ ఉందన్నారు. తాము స్థానిక పరిస్థితులను వివరించామని, సోనియా ఓపిగ్గా విన్నారని కనుమూరి బాపిరాజు అన్నారు.

English summary
We want people and Congress Party future but not our future, said Central Tourism Minister Chiranjeevi after met AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X