శాంతిగా ఉండటం తప్పైంది: జెసి, రిజైన్లే: టిజి వెంకటేష్

సీమాంధ్ర నేతలమంతా ఈ రోజు సాయంత్రం సభాపతిని కలిసి రాజీనామాలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు సిఎల్పీలో భేటీ అవుతామన్నారు. అనంతరం రాజీనామాలు సమర్పిస్తామన్నారు. సీమాంధ్రలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.
రాష్ట్ర విభజనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కారణన్నారు. అన్ని పార్టీల అధ్యక్షుల నిర్ణయాలనే కొంపముంచిందన్నారు. పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేశాయన్నారు. ఇన్నాళ్లు శాంతియుతంగా ఉండటమే తాము చేసిన తప్పన్నారు.
తాము కూడా సమైక్య ఉద్యమంలో పాల్గొంటామన్నారు. తద్వారా తమ పార్టీ అధిష్టానానికి సమైక్య రాష్ట్ర ప్రాధాన్యతను తెలియజేస్తామన్నారు. గాంధీ కుటుంబానికి ఆందోళనలో తీవ్ర అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనపై కాంగ్రెసు పార్టీ తీర్పును మరోసారి పరిశీలించాలని కోరుతామన్నారు. మహాదేవత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications