అందరు సరేనని మమ్మల్ని దోషుల్ని చేయొద్దు: బొత్స

సున్నితమైన అంశం విషయంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రజలు మాట్లాడారంటే తెలియక అనుకోవచ్చునని, రాజకీయ పార్టీలు మాట్లాడటమేమిటన్నారు. విభజన కొన్ని ప్రాంతాలకు బాధాకరమైన విషయమే అయినప్పటికీ అన్ని పార్టీల ఆమోదంతో జరుగుతోందన్నారు. సున్నిత అంశాల విషయంలో రాజకీయాలను పక్కన పెట్టాలని బొత్స కోరారు. మన రాష్ట్రంలో హైదరాబాదులో మాత్రమే అందరూ పెట్టుబడులు పెట్టారన్నారు. హైదరాబాదును సూపర్ హబ్‌గా తీర్చిదిద్దామన్నారు.
సీమాంధ్ర ప్రాంతాంలో కూడా చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. శాంతియుతంగా తమ నిరసనను తెలియజేసుకోవచ్చునని చెప్పారు. తాము తెలంగాణ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఇస్తామని బాహాటంగా ప్రకటించిందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజధాని కోసం పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడాన్ని తాను తప్పు పట్టడం లేదన్నారు.
రాజీనామాలు పరిష్కారం కాదు: పనబాక
కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాజీనామాలు అవసరం లేదని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి న్యూఢిల్లీలో అన్నారు. రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. హైదరాబాదు, ఇతర సమస్యల పైన చర్చించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications