కోడెల సంచలన వ్యాఖ్య, బాబుకు అలవాటని శ్రీకాంత్‌రెడ్డి

మంత్రి పదవులు, ప్రాజెక్టులు బొగ్గు వాటాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతోంది కాంగ్రెసు పార్టీ నేతలే అని ఆరోపించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు నాటకాలు ఆడకుండా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ రాజీనామాలను చిత్తశుద్దితో ఆమోదింప చేసుకోవాలన్నారు.
సాగునీటి వాటా, రాజధానిపై ముందు తేల్చాకే విభజనపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు అధిష్టానానికి తెలుగు వారి ప్రయోజనాలను తాకట్టు పెట్టారన మండిపడ్డారు. 1999లో తెలంగాణకు బీజం వేసింది వైయస్ రాజశేఖర రెడ్డే అన్నారు. టిడిపిని నిందించడం మాని వారు రాజీనామాలు చేస్తే విభజన ఆగుతుందన్నారు.
ఆడుకోవడం అలవాటే: శ్రీకాంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సెంటిమెంటుతో ఆడుకోవడం అలవాటేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టిడిపి వల్లే విభజన జరుగుతోందని ఆరోపించారు. విషయం తెలుసుకోకుండా టిడిపి నేతలు తమ పార్టీ పైన విమర్శలు గుప్పించవద్దన్నారు. ఆ పార్టీ సీమాంధ్ర నేతలు నోరు మెదపలేని ఉన్నారన్నారు. విభజనను బాబు స్వాగతించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు, కాంగ్రెసు పార్టీ ఎంపీలు తెలుగు ప్రజల గుండెల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.












Click it and Unblock the Notifications