సోనియా వధువు, కెసిఆర్ వరుడు: కొడ్తారని రాయపాటి
హైదరాబాద్/నెల్లూరు/విశాఖ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సమైక్యాంధ్ర ఉద్యమకారులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని వరుడిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును వధువుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వివాహం జరిపారు. అనంతరం రోడ్డు పైనే వంటలు చేసి విందు భోజనం పెట్టారు. అనంతరం వీరికి పుట్టిన బిడ్డే తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

చితకాబాదుతారు: రాయపాటి
తాను ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగితే.. ప్రజలు చితకబాదడం ఖాయమని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు యూపిఏ నిర్ణయం తీసుకొన్న దరిమిలా రాజీనామా ప్రకటన చేసిన రెండు రోజుల అనంతరం గురువారం న్యూయార్క్ నుంచి మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే చేరుతారా అని ప్రశ్నిస్తే... దేశానికి తిరిగి వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు. తిరిగి వచ్చిన వెంటనే పార్టీని వీడతానని, ఎంపీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తానని చెప్పారు.
డిగ్గీకి లక్ష చెప్పులతో స్వాగతం: అడుసుమిల్లి
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంత ప్రజలను సమాధాన పరిచేందుకు దిగ్విజయ్ సింగ్ వస్తానని చెబుతున్నారని, ఆయనకు లక్షలాది చెప్పులతో స్వాగతం పలుకుతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అడుసుమిల్లి జయప్రకాష్ హెచ్చరించారు. చేయవలసిందంతా చేసి తగుదనమ్మా అని రాష్ట్ర పర్యటనకు వస్తాననడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, ఎల్లలు, వనరులు, పరిస్థితులు తెలియక దిగ్విజయ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం, ఎల్లలు, వనరులు, పరిస్థితులు తెలియక దిగ్విజయ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రం కోసం కోస్తా, రాయలసీమ కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేస్తామని నిరసనను తెలియచేస్తుంటే వారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా బఫూన్‌లుగా పరిగణిస్తున్నారని దిగ్విజయ్‌ను దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications