చిరంజీవి వస్తే రాళ్లతో కొట్టండి: టిపై శోభారాణి నిప్పులు

కొందరు నేతల స్వార్థం వల్లనే రాష్ట్రం విడిపోతుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్ వదిలి వెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఉన్మాద పరిస్థిత ఉందని, బయటకు వెళ్లే పరిస్థితి లేదని అందుకే తాను గృహ నిర్బంధంలో ఉన్నానని చెప్పారు.
విభజనకు చిరంజీవే ప్రధాన కారణమన్నారు. చిరంజీవి రాజీనామా చేయని పక్షంతో ఆయనను రాళ్లతో కొట్టాలన్నారు. చిరంజీవి అంటే ఇప్పుడు ఎవరికి అభిమానం లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి వెళ్లినా, సీమాంధ్రకు వెళ్లినా ఆయనను కొడతారన్నారు. రాళ్లతో కొట్టాలని తాను కూడా పిలుపునిస్తున్నట్లు చెప్పారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోను నటుడే అని విమర్శించారు.
సమైక్యాంధ్ర జెఏసి
తాము సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితిని ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. సకల జనుల సమ్మెకు సమాయత్తమవుతున్నట్లు చెప్పారు. యూపిఏ నిర్ణయం బాధాకరమన్నారు. సాగునీరు, తాగునీరు అంశాలపై తేల్చాకనే రాష్ట్రాన్ని విభజించాలని మాజీ మంత్రి, అనంతపురం సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications