జగన్‌తో ములాకత్ 2 గంటలా?: యనమల మరో లేఖ

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, నేతలు మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సాక్షి టివి, సాక్షి పత్రికల ఈడి సజ్జల రామకృష్ణా రెడ్డి గత నెల 29న జైలులో కలిశారని, నిబంధనలకు విరుద్ధంగా రెండు గంటల పాటు మాట్లాడారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు గురువారం ఆరోపించారు.

ఆ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌లతో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ములాఖత్ పేరుతో రెండు గంటలకు పైగా చర్చలు జరపడమేమిటని ప్రశ్నించారు. జగన్ తన పార్టీ కార్యకలాపాలకు చంచల్‌గూడ జైలును అడ్డాగా మార్చేశారని యనమల మండిపడ్డారు.

మాజీ మంత్రి కొండా సురేఖ, ఇతర నేతలతో పార్టీకి వచ్చిన వైరుధ్యాలు, తెలంగాణ అంశం తదితర రాజకీయ విషయాలపై చర్చించేందుకు వీరు కలిశారని పత్రికలలో వచ్చిందన్నారు. తాను చంచల్ గూడ జైలు సూపరిండెంటుకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పుడు.. ములాకత్ సమయం అరగంటకు మించకూడదని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.

జైలు నిబంధనల చట్టం ప్రకారం సూపరింటెండెంట్ తన విచక్షణ మేరకు సమయాన్ని పొడిగించవచ్చునని... కానీ ములాకత్ చర్చ మాత్రం ప్రయివేటు, ఇంటి విషయాల పైనే జరగాలన్నారు. రాజకీయాలపై చర్చ కోసం సమయాన్ని పొడిగించకూడదన్నారు. ముగ్గురి కంటే ఎక్కువ మంది ములాకత్ అయ్యే వీల్లేకపోయినా అందరికీ అనుమతించారని ఆరోపించారు. జగన్ సౌలభ్యం కోసం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న దాని పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+