హైదరాబాద్ కన్నా మంచి రాజధాని: దిగ్విజయ్ సింగ్

సీమాంధ్రలో అపారమైన వనరులున్నాయని ఆయన చెప్పారు .ఒంగోలు, కర్నూలు, గంటూరు వంటి అభివృద్ధి చెందిన నగరాలున్నాయని అన్నారు. రాజీనామాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో మాట్లాడేందుకు ఇద్దరు ఎఐసిసి కార్యదర్శులను పంపించినట్లు ఆయన తెలిపారు.
రాజీనామాలు చేయాలని ఆలోచిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్నారు. కాగా, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణకు చెందిన డిఎస్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసినట్లు సమాచారం. రాజీనామాలకు సిద్ధపడిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో మాట్లాడే బాధ్యతను సోనియా డిఎస్‌పై పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామాలకు సిద్ధపడ్డారు. కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్ సహా ఏడుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేశారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మాత్రం రాజీనామాకు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications