చెర్రీ ఎవడు ఫ్లెక్సీ చించివేత: చిరు రాజీనామాకి డిమాండ్
రాజమండ్రి/విజయవాడ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ఆయన అభిమానులు ఆదివారం అల్టిమేటం జారీ చేశారు. సమైక్యాంధ్ర కోసం చిరంజీవి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజమండ్రిలో అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రామ్ చరణ్ ఎవడు కొత్త సినిమా ఫ్లెక్సీలను చించివేసి నిరసన తెలిపారు.
చిరంజీవి రాజీనామా చేయని పక్షంలో ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన ఎవడు చిత్రాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఈ నెల 21వ తేది లోగా రాజీనామా చేసి, సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నారు. చిరు జన్మదిన వేడుకలను కూడా తాము బహిష్కరిస్తామని చెప్పారు. తమకు సినిమాల కంటే సమైక్యాంధ్రనే ముఖ్యమన్నారు.

రాష్ట్ర విభజన ప్రక్రియ పైన ఇంకా చాలా కసరత్తు చేయాల్సి ఉందని పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ పేర్కొన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఉన్నతస్థాయి కమిటీకి నివేదిస్తామన్నారు. సీమాంధ్రవాసులను రెచ్చగొట్టే విధంగా కెసిఆర్ మాట్లాడటం సరికాదన్నారు.
కాంగ్రెసు నేతలు అసమగ్ర విభజన చేసిన అధిష్టానంతో పోరాడాలని, రోడ్లపై కాదని తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు అన్నారు. ఉమ్మడి కుటుంబం విడిపోతే ఒకరికి ఆస్తులు ఇచ్చి, మరొకరిని వట్టి చేతులతో ఎలా వెళ్లిపోమంటారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications