కెసిఆర్‌లో అభద్రతా భావం, బాబు హుందా: మందకృష్ణ

సీమాంధ్రులు కెసిఆర్ వ్యాఖ్యలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన ఉనికి కోసం చిల్లర మాటలు వద్దన్నారు. తెలంగాణ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హుందాగా స్పందించారన్నారు. పంపకాలు అన్ని రాజ్యాంగబద్ధంగానే జరుగుతాయన్నారు.
ఇష్టం లేకనే: గజ్జెల కాంతం
తెలంగాణ రావడం ఇష్టం లేకనే కెసిఆర్ దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఎన్నిడూలేనంతగా నేడు సచివాలయంలో ఉందంటే అక్కడ పని చేస్తున్న కెసిఆర్ బంధువులైన నరేంద్ర రావు, శ్రీనివాస రావులను కెసిఆర్ ప్రోత్సహించడమే అందుకు కారణమన్నారు.
సీమాంధ్ర ఉద్యోగుల్ని హేళన చేస్తూ ఇక్కడి నుండి పొమ్మని చెప్పడానికి కెసిఆర్ ఎవరని ప్రశ్నించారు. ప్రజలు శ్రమపడి తెచ్చుకున్న తెలంగాణను ఆయన ఇష్టం లేక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి బయటకెళ్లాల్సి వస్తే మొదట పోవాల్సింది ఆయనే అన్నారు.












Click it and Unblock the Notifications