వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ పెంచి పోషించారు: తెలంగాణపై టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు/ అనంతపురం: రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ ఆఖరి ముద్దాయి అని రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విభజన వాదాన్ని పెంచి పోషించారని, తెలంగాణ భవన్ నిర్మాణానికి సహకరించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డేనని అని ఆరోపించారు. విభజన అనివార్యమైతే పలు డిమాండ్లు వస్తాయన్నారు. సమైక్యవాదమే సమస్యకు పరిష్కారమని మంత్రి మంత్రి అన్నారు.

మూడు నెలలు సాగాలి

సమైక్యాంధ్ర ఉద్యమం మరో మూడు నెలల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని రాయలసీమకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు ర్యాలీని ప్రారంభించారు.

TG Venkatesh

ఉపాధ్యాయులు, జెఎసి రిలే దీక్షల్లో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. క్రైస్తవ సంఘాలు నిర్వహించిన భారీ ప్రదర్శనలో కూడా ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజనపై ఏ విధమైన శాస్త్రీయత లేకుండా ప్రకటన చేశారని ఆయన విమర్శించారు. విభజనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేత వ్యక్తమవుతోందని ఆయన అననారు. హైపవర్ కమిటీ ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

రాజీవ్ విగ్రహాల ధ్వంసం కూడదు

ప్రజల మనోభావాలను గౌరవించినట్లే పార్టీ నిర్ణయాన్ని కూడా గౌరవించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజనపై అన్నారు. విభజన నెపంతో కాంగ్రెసు కుట్రలూ కుతంత్రాలూ జరుగుతున్నాయని ఆయన అన్నారు. జిల్లాల్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమని ఆయన సోమవారం ఆయన మహిళా కాంగ్రెసు నాయకుల సమావేశంలో అన్నారు.

English summary
Andhra Pradesh minister from Rayalaseema TG Venkatesh said that Congress is the last culprit in bifurcation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X