వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై షర్మిల: జగన్‌కు పువ్వాడ అజయ్ షాక్, రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఖమ్మం జిల్లాలో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ సోమవారం జగన్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణపై ఇచ్ఛాపురంలో ఆ పార్టీ నాయకురాలు షర్మిల వ్యాఖ్యల పట్ల మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరిగిన నేపథ్యంలో సిడబ్ల్యూసి ప్రకటనకు ముందే ఆ పార్టీ సీమాంధ్రకు చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

దీనిపై అసంతృప్తి చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జిట్టా బాలకృష్ణా రెడ్డి తదితరులు ఇప్పటికే పార్టీని వీడారు. మరికొందరు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం షర్మిల తన పాదయాత్ర ముగింపు సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాజాగా పువ్వాడ అజయ్ కుమార్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

వైయస్ కుటుంబానికి ఎంతో సన్నిహితురాలైన కొండా సురేఖ ఆ పార్టీని వీడి, పార్టీ వైఖరి పైన అప్పటి నుండి నిప్పులు చెరుగుతున్నారు. ఇన్నాళ్లు తెలంగాణ సొత్తును దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు... ఆ దోపిడీ ఆగుతుందన్న బాధతోనే ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడుతున్నారని ఆమె ఆదివారం కూడా నిప్పులు చెరిగారు.

English summary
Khammam district leader Puvvada Ajay Kumar has 
 
 announced his resignation from the YSR Congress Party 
 
 on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X