వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం: చిద్దూ, కోట్ల లాబీయింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్రమంత్రి చిదంబరం సోమవారం రాజ్యసభలో తెలంగాణపై రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రకటించారు. కేబినెట్ నోట్ సిద్ధమైందని తెలిపారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ముందు అనేక అంశాలను పరిశీలించాల్సి ఉందని, ఆ అంశాలనన్నింటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని చిదంబరం తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ నోట్‌ను కేబినెట్ ముందుకు తీసుకు వస్తుందని చెప్పారు. రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ ఏర్పాటు అన్నారు. నదీ జలాలు, విద్యుత్, సీమాంధ్రుల భద్రతపై చర్చిస్తామని, ప్రాథమిక హక్కులు కాపాడే బాధ్యత కేంద్రానిదే అన్నారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆగస్టు 8న జరిగే కేబినెట్ సమావేశంలో నోట్ పైన చర్చ జరిగే అవకాశముంది.

కాగా, ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు సభలను విభజన అంశం కుదిపేసింది. దీంతో లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభలను రెండుసార్లు వాయిదా వేశారు. మూడోసారి కూడా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఆందోళన చేయడంతో ఇరు సభలను మంగళవారానికి వాయిదా వేశారు.

లోకసభలో ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్ష కుమార్ తదితరులు ఆందోళన చేపట్టారు. వారు పోడియం వైపుకు దూసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సైగ చేయడంతో అందులో కొందరు వెనక్కి తగ్గారు.

రాజ్యసభలోను సీమాంధ్ర ఎంపీలు నిరసన తెలిపారు. ఓ దశలో డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంపీల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ లాగా తెలంగాణ అంశం కూడా ముఖ్యమైనదేనని వ్యాఖ్యానించారు. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం సీమాంధ్ర కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. భేటీకి కిశోర్ చంద్రదేవ్ జరు కాలేదు. అయితే వారి సమావేశానికి మద్దతిస్తానని ఆయన చెప్పారు.

రాయల తెలంగాణ కోసం కోట్ల లాబీయింగ్

కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాయల తెలంగాణ కోసం లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. సోనియా గాంధీతో ఆయన కర్నూలు ఎమ్మెల్యేల అపాయింటుమెంటును ఫిక్స్ చేశారని తెలుస్తోంది. రేపు ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అధినేత్రిని కలువనున్నారు. రాయల తెలంగాణ కోసం వారు అధినేత్రికి విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. విభజన జరిగితే కర్నూలును హైదరాబాదులో కలపాలని కోట్ల చెబుతున్నారు. ఇందు కోసమే ఎమ్మెల్యేలకు సోనియా అపాయింటుమెంట్ ఇప్పించినట్లుగా తెలుస్తోంది.

ద్విసభ్య కమిటీ అభిప్రాయాలు చెబుతాం

సీమాంధ్రుల అభిప్రాయ సేకరణకు ఉన్నతస్థాయి ద్విసభ్య కమిటీ ఏర్పాటయిందని, దానికి తమ అభిప్రాయాలు చెబుతామని కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. ఈ కమిటీలో దిగ్విజయ్ సింగ్, ఎకె ఆంటోనీలు ఉన్నారు. వారికి సీమాంధ్రులు తమ వాదన వినిపించుకోవచ్చు. అంతకుముందు సీమాంధ్ర కేంద్రమంత్రులతో ఎకె ఆంటోని సమావేశమయ్యారు.

English summary
Telangana Constitutional process begins.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X