బాబూ, నోరు విప్పు: విభజనపై వైయస్ వివేకానంద

YS Vivekananda Reddy
అనంతపురం / హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మౌనంగా ఎందుకు ఉన్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల వారు అభివృద్ధి చేసిన తర్వాతే విభజనపై ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

విభజన అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసి పడుతున్న తరుణంలో చంద్రబాబు మౌనంగా ఉండటం తగదన్నారు. పదవీకాంక్షతోనే కేంద్ర మంత్రులుగా ఉన్న ఎంపీలు నోరు మెదపడం లేదన్నారు.

మడమ తిప్పేది లేదు: నారాయణ

తమ దిష్టిబొమ్మలనే కాదు, తమను తగలబెట్టినా రాష్ట్ర విభజనపై తమ విధానం మారదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోరుకునే వారు 23జిల్లాల్లోనూ ఆందోళనలు చేయాలని ఆయన సూచించారు. తెలంగాణపై కెసిఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఇరుప్రాంతాల ప్రజల అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు.

రాష్ట్ర విభజన అనివార్యమైతే సీమాంధ్రుల్ని ఎలా సముదాయించాలనే సిపిఐ కసరత్తు మొదలుపెట్టింది. చారిత్రక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటవుతోందని చెబుతూనే, కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి సమన్యాయం దక్కేలా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమని చెబుతోంది. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆదివారం హైదరాబాద్‌లో వివిధ రంగాల నిపుణులు, మేధావులతో చర్చలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+