అధికారం కోల్పోయి పదేళ్లు, బాబు అంటే భయం: గాలి

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి పదేళ్లయినా ప్రతి అంశంలో ఇంకా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన విమర్శలు గుప్పించడమేమిటని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు బుధవారం మండిపడ్డారు. రాష్ట్రంలో విభజనవాదానికి బీజం వేసింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అయితే, విభజించింది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అని, ఇందులో బాబు పాత్ర ఏమిటని ప్రశ్నించారు.

ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెసు విభజన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నందునే సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లేఖ ఇచ్చిందని, ఇడుపులపాయలోని తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు విభజన విషయంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

టిడిపి పుట్టిందే తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడేందుకన్నారు. నీళ్లు, నిధులు, రాజధాని, ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్తుపై చెప్పకుండా విభజన నిర్ణయాన్ని ప్రకటించారని విమర్శించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చిచ్చుపెట్టేందుకు కాంగ్రెసు పన్నుతోందన్నారు. అధికారంలో ఉంటే ఓ విధంగా లేకపోతే మరో విధంగా మాట్లాడుతోందన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లకు విభజన విషయం ముందే తెలుసునన్నారు. దానిని శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ చెప్పారన్నారు.

విభజన విషయం ముందే తెలిసినప్పుడు వారు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం కేంద్రమంత్రులు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. బాబు అంటే భయం వల్లనే తాము అధికారంలో లేకున్నా తమ పైన విమర్శలు చేస్తున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంగ్రెసు నేతలు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఇటలీ వనిత ముందు తాకట్టు పెట్టారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+