వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళనలు: డిజిపి హెచ్చరిక, ఓయు ఆంక్షలే ఎస్కెలో

By Srinivas
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
హైదరాబాద్: ఆందోళనకారులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని డిజిపి దినేష్ రెడ్డి గురువారం హెచ్చరించారు. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో రైల్ రోకోలు చేసే వారి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని చెప్పారు. సీమాంధ్రలో రైల్ రోకోలపై ఆందోళనకారులు పునరాలోచన చేయాలన్నారు. రైళ్లను అడ్డుకోవడం, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం గానీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుకోవచ్చునని సూచించారు. సీమాంధ్ర ప్రాంతంలో కొన్నిచోట్ల జాతీయ నేతల విగ్రహాలను కూల్చుతున్నారని వారి పైన కేసులు పెడతామన్నారు. విగ్రహాల జోలికి ఎవరూ వెళ్లవద్దన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు రంగ ప్రవేశం చేయక తప్పదన్నారు పలు కేసులు నమోదయ్యాయని, వీడియో ఆధారాలు ఉన్నాయి చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేస్తే మూడేళ్లు శిక్ష ఉంటుందన్నారు.

పోలీసులకు రాజకీయాలు, ప్రాంతాలు, కులం, మత బేధాలు ఉండవని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఆంక్షలు విధించామో... అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో అలాంటి ఆంక్షలే విధించామన్నారు. పోలీసులకు తెలిసింది.. ఫిర్యాదుదారు, ముద్దాయి మాత్రమే అన్నారు. విభజన నిర్ణయం ప్రకటకు పదిహేను రోజుల ముందే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ముందస్తు ప్రణాళికల వల్లే ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదన్నారు.

హైదరాబాదులోని ఎపిఎన్జీవో ఉద్యోగులు కార్యాలయాల ఆవరణలో ఆందోళన చేయవద్దన్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా ర్యాలీలు అడ్డుకుంటామని చెప్పారు. పోలీసులకు పక్షపాతం ఉండదన్నారు. ర్యాలీలు నిషిద్ధమన్నారు.

English summary
The AP DGP Dinesh Reddy today warned the Samaikyandhra agitators not to take law into their hands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X