హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసేందుకే డిమాండ్లు: కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kalwakuntla Kavitha
హైదరాబాద్: హైదరాబాదు తమకు దక్కడం లేదనే దురుద్దేశ్యంతో శాశ్వత ఉమ్మడి రాజధాని, ఢిల్లీ తరహా పాలన వంటి డిమాండ్లు తెస్తూ.. ప్రశాంత హైదరాబాదును తెలంగాణ వారికి దక్కకుండా అల్లకల్లోలం చేయడమే సీమాంధ్ర నాయకుల లక్ష్యంగా కనిపిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం మండిపడ్డారు.

సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పి కొడదాం.. తెలంగాణను కాపాడుకుందామనే నినాదంతో కార్యాచరణకు దిగుతున్నట్లు తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరాం వేరుగా ప్రకటించారు. ఇందులో భాగంగా 10 (శనివారం) నుంచి హైదరాబాద్‌లో సద్భావన యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. 12 తర్వాత తెలంగాణ ఉద్యోగులు చేపట్టే అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలకూ జేఏసీ అండగా నిలుస్తుందని చెప్పారు.

తెలంగాణపై సిడబ్ల్యూసి తీర్మానం గురించి, హైదరాబాద్ ఆవశ్యకతపైనా ప్రజలకు అవగాహన కలిగించటానికి సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తామని, పెద్దఎత్తున కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తామని వెల్లడించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఐకాస విస్తృత స్థాయి స్టీరింగ్ కమిటీ భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించే ఆలోచన ఉందని, జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాలపైనా ప్రకటన చేస్తామని చెప్పారు.

సిడబ్ల్యూసి చేసిన తీర్మానం కార్యరూపం దాల్చేలా చేసే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలపైనే ఉందని పునరుద్ఘాటించారు. తెలంగాణపై ప్రజలకిచ్చిన హామీకి టిడిపి కట్టుబడి ఉండాలని, ఆ పార్టీ సీమాంధ్ర నేతలు అవాంతరాలు కలిగిస్తున్నారని, ఈ విషయంలో టిడిపి తెలంగాణ నేతలు మౌనంగా ఉండటం శోచనీయమని, వారంతా కదలాలని కోరారు. సమైక్యవాద వైఖరితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

English summary

 The Telangana Jagrithi president Kalwakuntla Kavitha has lashed out at Seemandhra leaders for demanding Hyderabad permanent capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X