నాల్గో రోజు అట్టుడికిన సభ, కాంగ్రెస్ వల్లేనని బిజెపి భగ్గు
న్యూఢిల్లీ/హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నాలుగో రోజు కూడా విభజన అంశంపై అట్టుడుకుతోంది. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు, సమైక్యాంధ్ర కావాలంటూ కాంగ్రెసు పార్టీ ఎంపీలు ఉభయ సభలలో నిరసన తెలిపారు. లోకసభను స్పీకర్, రాజ్యసభను చైర్మన్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో కాంగ్రెసు, టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జై సమైక్యాంధ్ర, మా ప్రాంతానికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అధఇకార పార్టీ సభ్యుల తీరు పైన భారతీయ జనతా పార్టీ అగ్రహం వ్యక్తం చేసింది. బిజెపి రాజ్యసభ నుండి వాకౌట్ చేసింది.

అధికార పార్టీ సభ్యుల మధ్యనే ఐక్యత లేదని కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు చేసింది. అధికార పార్టీ వైఖరి కారణంగానే సభ ప్రశాంతంగా జరగడం లేదని, గొడవలకు ఆ పార్టీయే బాధ్యత వహించాలని, పాక్ చొరబాటు విషయంలోను అధికార పార్టీ తీరు సరిగా లేదని బిజెపి భగ్గుమంది. లోకసభలో ఎంపీలు వెల్ లోకి చొచ్చుకుపోయారు.
ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణలు పోడియం వైపుకు దూసుకు పోయారు. జోరుగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications