మంత్రులకు తెలుసు: టిపై గీతా, డిగ్గీయే చెప్పారు: టిడిపి

తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించినందు వల్లనే సోనియా ప్రత్యేక రాష్ట్రానికి అంగీకరించారని చెప్పారు. పూర్తిస్థాయిలో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ అధినేత్రి గుర్తిస్తునే నమ్మకం తమకు మొదటి నుండి ఉందన్నారు.
వైయస్సేనని డిగ్గీ చెప్పారు: యనమల
1999లో తెలంగాణ భావనకు పునాది వేసింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డేనని ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ధృవీకరించారని తెలుగుదేశం పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. కాంగ్రెసు నేతలతో సంప్రదింపుల కోసమే ఆంటోనీ కమిటీని వేశారని, ప్రజాభిప్రాయ సేకరణ కోసం కాదన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీది పెత్తందారి పోకడ అన్నారు.
పచ్చగా ఉన్న రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టిన నిప్పుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే బాధ్యత అన్నారు. ప్రజా కోర్టులో తల్లి, పిల్ల కాంగ్రెసులు రెండు ముద్దాయిలేనని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్న దురాశతో తెలుగు జాతికే తీవ్ర నష్టం కలిగించారన్నారు.












Click it and Unblock the Notifications