మనసెలా వచ్చింది, ఎవరికి సిఎంవి?: కిరణ్‌పై డిఎస్ ఫైర్

D Srinivas and Kiran Kumar Reddy
నిజామాబాద్: విభజన విషయంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మనసెలా వచ్చిందని మాజీ పిసిసి చీఫ్, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్ శుక్రవారం నిప్పులు చెరిగారు. కిరణ్ వ్యాఖ్యలపై డిఎస్ నిజామాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని, ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని కేంద్రం ఎప్పటికప్పుడు గమనిస్తోందని అన్నారు.

అందుకే చారిత్రక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నీ అవగాహన చేసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పెద్దమనుషుల ఒప్పందం అమలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అయినా పార్టీ నిర్ణయం తీసుకున్నాక మీడియాకెక్కడమేమిటని ప్రశ్నించారు. నిర్ణయం నచ్చకుంటే పార్టీ వేదిక పైన మాట్లాడాలని హితవు పలికారు. నీకు ఎమ్మెల్యేలు ఓటు వేస్తే... ముఖ్యమంత్రివి కాలేదని, అధిష్టానం దయతో అయ్యావని మండిపడ్డారు.

ఆ అధిష్టానమే విభజనపై నిర్ణయం తీసుకుందన్నారు. నీ తండ్రి కాంగ్రెసు పార్టీకి లాయల్‌గా ఉన్నారని, యువకుడివి అని, పార్టీని ముందుకు తీసుకు వెళ్తావని అధిష్టానం నిన్ను ముఖ్యమంత్రిని చేసిందన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి సమైక్యాంధ్ర కోసం ఎలా సంతకం పెడతావని ప్రశ్నించారు. ఎపికి ముఖ్యమంత్రివా లేక ప్రాంతానికా అని ఘాటుగా ప్రశ్నించారు. తాను పిసిసి చీఫ్‌గా చేశానని, కానీ ఇలా వ్యవహరించలేదన్నారు.

తెలంగాణలో సహజసిద్ధ వనరులు ఉన్నాయన్నారు. అలాంటిది విద్యుత్ కొరత ఉంటుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నదీ జలాలన్నీ అంతర్రాష్ట్రాలతోనే ముడిపడి ఉన్నాయన్నారు. వాటికి శాస్త్రీయ పద్ధతుల్లో పరిష్కారముంటుందని చెప్పారు. ఇన్నాళ్లు తాము ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని కానీ, నిన్న కిరణ్ మాట్లాడిన మాటలు సరికాదన్నారు. కిరణ్ సీమాంధ్రుల్లో అభద్రత భావం కల్పిస్తున్నారని ఆరోపించారు.

తాను హైదరాబాదులోనే పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే చదివానని చెబుతున్న ముఖ్యమంత్రిని వెళ్లమని చెబుతున్నదెవరన్నారు. ఆయన ఇక్కడే దర్జాగా ఉండవచ్చునని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+