నిర్ణయం తిరుగులేనిది: జైపాల్, కిరణ్‌కు షబ్బీర్ కౌంటర్

Jaiapl Reddy
హైదరాబాద్: తెలంగాణపై తీసుకున్న నిర్ణయం తిరుగులేనిదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఉన్నత పదవులలో ఉన్న వాళ్లు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని, ఆత్మవిశ్వాసం లేనివాళ్లే ప్రచారం చేసుకుంటారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యల పైన జైపాల్ రెడ్డి స్పందించారు.

తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం శిలాశాసనమని అన్నారు. ఈ నిర్ణయం సులువుగా తీసుకున్నది కాదని, చర్చల అనంతరం తీసుకున్నారన్నారు. ఊహాజనిత భయాలను అందరు తొలగించుకోవాలన్నారు. ఆత్మవిశ్వాసం లేనివాళ్లే ప్రచారం చేసుకుంటారని విమర్శించారు. నదీ జలాలపై తీర్మానంలో స్పష్టం చేశారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే హైదరాబాద్ పెద్ద పట్టణమని తెలుసుకోవాలన్నారు. హైదరాబాదు పైన మమకారం ఉన్న వారిని తాము తెలంగాణకు స్వాగతిస్తామన్నారు. హైదరాబాదులో ఉంటున్న సీమాంధ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సిఎం చెప్పిన వ్యాఖ్యల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు.

కిరణ్‌కు షబ్బీర్ అలీ కౌంటర్

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోవాలని, వర్కింగ్ కమిటీ నిర్ణయమంటే సోనియా నిర్ణయమనే విషయాన్ని గుర్తించాలన్నారు. అప్పుడు తలూపి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.

ఆంటోని కమిటీ కాంగ్రెసు కమిటీ: వెంకయ్య

ఎకె ఆంటోని కమిటీ కాంగ్రెసు పార్టీ కమిటీ అని, అన్ని పార్టీల వాదనలు వినడానికి ప్రభుత్వం కమిటీని వేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు వేరుగా అన్నారు. ప్రస్తుత సమస్యలన్నింటికి కాంగ్రెసు పార్టీయే కారణమన్నారు. ఎన్డీయేతోనే సమర్థ పాలన సాధ్యమన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలన్నారు.

కాంగ్రెసు పార్టీ రెండు ప్రాంతాల్లో ప్రయోజనం పొందాలని చూస్తోందన్నారు. భవిష్యత్తుపై యువత ఆందోళలో ఉందన్నారు. భారత సైనికులకు పూర్తి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అంటేనే కాంగ్రెసు పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+