విభజన: ధర్మాన సహా 5గురు ఎమ్మెల్యేలు రాజీనామా

korla bharathi and dharmana prasad rao
శ్రీకాకుళం/వరంగల్: సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు తన శాసన సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ధర్మానతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే తాము రాజీనామా చేశామని ధర్మాన చెప్పారు.

తాము ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా పత్రాలను పంపించామన్నారు. విభజన ప్రక్రియ కొనసాగితే తమ రాజీనామా పత్రాలను సభాపతికి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. విభజిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా బలహీనపడుతుందన్నారు.

విభజన విషయంలో ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో చెప్పిన వ్యాఖ్యలను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పారు. రాజీనామా చేసిన వారిలో ధర్మాన ప్రసాద రావు, టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి, పలాస ఎమ్మెల్యే జగన్నాయకులు, ఆముదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, ఎచ్చర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, ఎమ్మెల్సీ విశ్వప్రసాద్‌లు రాజీనామా చేశారు.

సిఎం దిష్టిబొమ్మ దగ్ధం

తెలంగాణ ఏర్పాటు ప్రకటన పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ జిల్లా నర్సింహులపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆందోళన చేపట్టారు. చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కిరణ్ సమైక్యాంధ్రకు వత్తాసు పలకడం సరికాదని, ఆయనను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+